దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళా సంచలన ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఒకే పార్టీలో పనిచేసిన తనను బెదిరించి మూడు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మీడియాతో చెప్పుకొచ్చింది. ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామని.. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం ఆమెకు పదేపదే ఫోన్ చేసేవాడని.. ఎమ్మెల్యే లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని.. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని పెన్ కెమెరా పెట్టుకొని వీడియో రికార్డు చేశానని ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది. దీంతో అతనిపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ వేటు వేసింది.
BREAKING: ఆంధ్రా రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్