కర్ణాటక మద్యం విక్రయిస్తున్న మహిళ వలంటీర్ అరెస్ట్

ఏపీలో కొంతమంది వలంటీర్ల లీలలు అన్నీ ఇన్నీ కావు.

Update: 2023-09-08 05:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో కొంతమంది వలంటీర్ల లీలలు అన్నీ ఇన్నీ కావు. అనేకమంది దారుణాలకు, నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు వలంటీర్లు అక్రమంగా మద్యం విక్రయిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇందులో మహిళా వలంటీర్ సైతం ఉండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్ల క్లస్టరు-19 వలంటీర్లు అవర దాసరి సందీప్ కుమార్, మరో మహిళా వాలంటీర్ లేపాక్షి అమ్మాజీ. అయితే వీరు ఇరువురు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు. కర్ణాటకకు చెందిన నడిపిరెడ్డి సహకారంతో మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వలంటీర్ల నుంచి కర్ణాటక మద్యంతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం పలు సెక్షన్ల కింది వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితులకు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే స్థానికంగా ఉండే వైసీపీ నేత వీరి వెనుక ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. 


Similar News