ఏపీలో ఫ్యాన్ గాలి తగ్గిందా..? విశ్లేషకులు ఏమంటున్నారు ..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

Update: 2024-03-07 11:03 GMT
ఏపీలో ఫ్యాన్ గాలి తగ్గిందా..? విశ్లేషకులు ఏమంటున్నారు ..?
  • whatsapp icon

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతి పార్టీ రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అడుగులేస్తోంది. ఇక అధికారంలో ఉన్న వైసీపీ కూడా రానున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి ప్రచారం వరకు అన్నీ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరనుండి చూసుకుంటున్నారు.

పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్ కష్టానికి ప్రతిఫలం ఉంటుందా..? లేక బూడిదలో పోసిన పన్నీరే అవుతుందా..? అసలు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు..? జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని నమ్మిన వాళ్లలో నిరుద్యోగ యువత ముందు వరుసలో ఉంటారు. అయితే ప్రస్తుతం ఆ యువతలోనే జగన్ కి వ్యతిరేకత నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యకపోవడం, ఒకటో రెండో ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన లక్షలమంది నిరుద్యోగులు ఉంటె వందల్లో పోస్ట్ లు విడుదల చేయడం, అలానే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకు వచ్చే ప్రయత్నం చేయకపోవడం, ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండిపోవడం ఇలా చాలానే కారణాలు ఉన్నాయని అందుకే జగన్ ప్రభుత్వం పై యువతలో అసంతృప్తి నెలకొందని సమాచారం.

ఇక మహిళల్లోనూ జగన్ కి వెతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు రాష్ట్రాన్ని మద్యంలో ముంచెత్తుతున్నారని మహిళలు మండిపడుతున్నారు. అలానే అమ్మ ఒడి కింద ఇచ్చే డబ్బులు కూడా సరిగా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ధోరణి ఇలా ఉంటే.. అటు తన కుటుంబ సభ్యులు కూడా జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడడం పార్టీపై మరింత ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. సొంత చెల్లిళ్లే జగన్ పై ఆరోపణలు చేయడం అటు రాజకీయవర్గాల్లో ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధి ఎక్కడ..? రాజధాని ఏది..? సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా..? అనే ప్రశ్నలను జగన్ సోదరి వైఎస్ షర్మిల సూటిగా సంధిస్తుంటే.. ఇదిగో నేను చేసిన అభివృద్ధి అని చెప్పలేని స్థితిలో జగన్ ఉన్నారని.. సొంత చెల్లిని, తల్లిని పట్టించుకోని జగన్ ప్రజలను పట్టించుకుంటారా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇక అలానే సొంత బాబాయి వివేకా హత్య కేసులోనూ జగన్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవల వైఎస్ సునీత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమావేశంలో మా నాన్న చనిపోయాక.. ఎవరికీ తెలియకముందే గొడ్డలితో నరకడం కారణంగానే చనిపోయారు అనే విషయం మీకు ఎలా తెలిసింది అని సూటిగా అడిగారు.

అయితే ఆ ప్రశ్నకు కూడా జగన్ స్పందించలేదు. అలానే వివేకా హత్య కేసులో అప్రూవుడుగా మారిన దస్తగిరి కూడా వివేకా హత్యకేసులో జగన్ హస్తం ఉందని తెలిపారు. ఈ కారణాలన్నీ ప్రజల్లో వైసీపీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని.. ఇక ఇటీవల జరిగిన సంక్రాంతి పూజలో ప్రసాదాలను తినకుండా టిష్యూ పేపర్ లో పెట్టి సెక్యూరిటీకి ఇవ్వడంతో హిందువుల్లోనూ వ్యతిరేకత నెలకొందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఫ్యాన్ గాలి తగ్గిందని.. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవడం కష్టమే అని చెబుతున్నారు విశ్లేషకులు. 

Tags:    

Similar News