Tirumala News:తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Update: 2025-04-19 02:47 GMT
Tirumala News:తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.

ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్టమెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్‌లలో కూడా వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 58,519మంది భక్తులు దర్శించుకున్నారు. 30,360 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.27 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Tags:    

Similar News