Tirumala:కంపార్టుమెంట్‌లు దాటి MBC వరకు వేచి ఉన్న భక్తులు.. దర్శనానికి సమయం ఎంతంటే?

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు

Update: 2025-04-13 03:53 GMT
Tirumala:కంపార్టుమెంట్‌లు దాటి MBC వరకు వేచి ఉన్న భక్తులు.. దర్శనానికి సమయం ఎంతంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనం కోసం కంపార్టుమెంట్‌లు దాటి MBC వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 18-20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నిన్న(శనివారం) శ్రీవారిని 72,923 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,571 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News