చనిపోతున్నానంటూ మహిళా సెల్ఫీ వీడియో.. చివరికి ఏమైందంటే!

తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు.

Update: 2024-11-30 09:04 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తిరుమల(Tirumala)లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. తమిళనాడు(Tamilnadu)కు చెందిన భావన(35) అనే మహిళ భర్తతో గొడవపడి తిరుమల వచ్చింది. శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళుతూ.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా బెంగళూరు(Bengaluru)లో ఉన్న అన్నకు సెల్ఫీ వీడియో పంపింది. ఆ వీడియో చూసిన అతను వెంటనే తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. వీడియోలోని లొకేషన్, సీసీటీవీల ఆధారంగా  గంటలోనే పోలీసులు ఆమెను గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భర్త, పిల్లలను పిలిపించి మాట్లాడి సురక్షితంగా ఇంటికి పంపినట్లు సమాచారం.

Tags:    

Similar News