AP News:గొప్ప మనసు చాటుకున్న పోలవరం ఎమ్మెల్యే

జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు

Update: 2025-02-01 11:33 GMT
AP News:గొప్ప మనసు చాటుకున్న పోలవరం ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, జీలుగుమిల్లి: జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు వారి సతీమణి జ్యోతి చేతుల మీదుగా ప్రధాన ఉపాధ్యాయురాలు బి.గంగారత్నంకు లక్ష రూపాయలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పుడు తను చదువుకున్న స్కూల్ కి హెడ్ మాస్టర్ గా ఉన్న బి.గంగారత్నం, పి.డి.వీరస్వామి, టీచర్స్ పుష్ప కుమారి, ఫణికుమారి లకు ఈ డబ్బులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే పదవ తరగతిలో మంచి మార్కులతో ప్రథమ స్థానం సాధించిన వారికి మంచి బహుమతి అందజేస్తానని అన్నారు. క్రమశిక్షణలో వంద శాతం ఉత్తీర్ణత ఉండాలని, స్కూల్ నిమిత్తం ఏ అవసరం వచ్చిన ఈ స్టూడెంట్ ఉంటారనీ తనకు స్కూల్ పై ఉన్న అభిమానం చాటుకున్నారు.


Similar News