అలా చేస్తే వైసీపీలో బేషరతుగా చేరతా.. ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ స్పందించారు. వైసీపీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందంటూ వస్తున్న ప్రచారంపైనా ఘాటుగా స్పందించారు..

Update: 2023-02-13 10:33 GMT
అలా చేస్తే వైసీపీలో బేషరతుగా చేరతా.. ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ స్పందించారు. వైసీపీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందంటూ వస్తున్న ప్రచారంపైనా ఘాటుగా స్పందించారు. పదవులు తనకు ముఖ్యంకాదన్నారు. పదవులు వెంట్రుక ముక్కతో సమానమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేసేందుకు సంబంధించి టికెట్ ఇచ్చే అంశంపై స్పష్టమైన హామీ అధిష్టానం నుంచి రాలేదని అన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు. అయితే నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అయితే కొల్లేరు ప్రాంతం సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని, ఆ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తే వైసీపీలో బేషరతుగా చేరుతానని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News