యాదవుల కు వైసీపీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు:ముద్దాడ మధు

ఉత్తరాంధ్రలో యాదవులకు వైసీపీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్దాడ మధు అన్నారు.

Update: 2024-03-17 14:11 GMT
యాదవుల కు వైసీపీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు:ముద్దాడ మధు
  • whatsapp icon

దిశ ప్రతినిధి విజయనగరం:ఉత్తరాంధ్రలో యాదవులకు వైసీపీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్దాడ మధు అన్నారు.ఆదివారం విజయనగరం ప్రెస్ క్లబ్ లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముద్దాడ మధు యాదవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో యాదవులకు అసెంబ్లీ సీట్లు ఇప్పటికీ ప్రకటించినవి టీడీపీ-1 జనసేన-1 వైఎస్సార్సీపీ-జీరో. ఉత్తరాంధ్రలో అంతటా విజయనగరం నియోజకవర్గం వేల వరకు ఉన్న నియోజకవర్గాల్లో కూడా యాదవులను పరిగణలోకి తీసుకోకుండా టిక్కెట్లు కేటాయించడాన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తూ త్వరలోనే బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ విషయమే చర్చిస్తామన్నారు.నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు జనతా గ్యారేజ్, ముద్దాడ మధు యాదవ్ కార్యాలయాన్ని బాబా మెట్ట ,వుడా కాలనీ సాయి ధనలక్ష్మి, అపార్ట్మెంట్ లో మంగళవారం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

Read More..

ఆ నియోజకవర్గంలో ఆగని వలసలు..వైసీపీని వీడి టీడీపీలో చేరిక 

Tags:    

Similar News