పార్లమెంట్‌‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ.. తొలిరోజే తెగ ఆకట్టుకున్నాడుగా..!

18వ లోక్ సభ సమావేశాలు నేడు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంపీలుగా గెలిచిన వారంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Update: 2024-06-24 08:08 GMT
పార్లమెంట్‌‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ.. తొలిరోజే తెగ ఆకట్టుకున్నాడుగా..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : 18వ లోక్ సభ సమావేశాలు నేడు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంపీలుగా గెలిచిన వారంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముందుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా ఇలా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రేపటి వరకు కొనసాగనుంది. ఎక్కువ మంది హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రమాణ స్వీకారం చేయగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. ఇదంతా ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ సమావేశాల తొలిరోజే అందరినీ ఆకట్టుకున్నాడు. పార్లమెంట్‌కు వినూత్నంగా వెళ్లి ఆశ్చర్యపరిచాడు. తెలుగు నేతా.. మజాకా.. అన్నట్టు మిగతా ఎంపీలను ఆకర్శించాడు.

విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పల నాయుడు గెలిచారు. మొత్తం 15.68 లక్షల ఓట్లు సాధించిన ఆయన సమీప వైసీపీ అభ్యర్థిపై 2.69 లక్షల ఓట్ల తేడాతో తెలుగు దేశం పార్టీ నుంచి విజయం సాధించారు. ఎంపీలంటే ఎంతో దర్పం, హంగు, ఆర్భాటాలు చూపించే ఈ రోజుల్లో కలిశెట్టి అప్పల నాయుడు అతిసాధరణ వ్యక్తిలా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఎలాంటి అట్టహసం లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్‌పై వెళ్లారు. ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్‌పై చేరుకున్నారు. సైకిల్ ముందు భాగాన ‘సైకిల్‌ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతున్న వేళ..’ అంటూ రాసుకున్నారు. దేశంలోని అందరు ఎంపీల, మీడియా దృష్టిని ఆకర్శించిన ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News