Visakha: 10 మీటర్లు ఎత్తులో ఎగిసిపడుతున్న నీళ్లు.. పట్టించుకోని అధికారులు
విశాఖ హనుమంత వాక వద్ద వాటర్ పైప్ లైన్ పగిలింది. దీంతో నీరు వృథాగా పోతోంది..
దిశ, వెబ్ డెస్క్: విశాఖ హనుమంత వాక వద్ద వాటర్ పైప్ లైన్ పగిలింది. దీంతో నీరు వృథాగా పోతోంది. అంతేకాదు 10 మీటర్లపైకి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. మరోవైపు రోడ్డుపైకి నీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వాహనదారులపై నీరు పడుతోంది. దీంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో మార్గం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. గంటల తరబడి నీళ్లు పోతున్నాయంటూ మండిపడుతున్నారు.