Tragady: సముద్రంలో విరుచుకుపడ్డ అలలు.. ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

విశాఖ ఎన్నారై కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఇద్దరి విద్యార్థులు గురువారం ఉదయం ఆక్కే బీచ్‌కు వెళ్లారు...

Update: 2023-10-19 12:40 GMT

దిశ, వెబ్ డెస్క్: సముద్ర స్నానం ఇద్దరు యువకుల ప్రాణం మీదకు వచ్చింది. పండుగ సెలవుల నేపథ్యంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు సరదాగా గడిపేందుకు విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లారు. స్నానం చేసేందుకు సముంద్రంలోకి దిగారు. కొంతసేపు సముద్రంలో సరదాగా ఈత కొట్టారు. అయితే అలలు దాటికి విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. సముద్రపు నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న మెరైన్ సిబ్బంది సముద్రంలో గాలించారు. అయితే ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి మృతదేహాం లభ్యమైంది. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగింది.

విశాఖ ఎన్నారై కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఇద్దరి విద్యార్థులు గురువారం ఉదయం ఆర్కే బీచ్‌కు వెళ్లారు. అనంతరం సముద్రంలో స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. మిగిలిన వాళ్ల అరుపులు, కేకలతో మెరైన పోలీసులు, ఇతర సిబ్బంది సముద్రంలో గాలించారు. ఇద్దరు విద్యార్థుల్లో ఒకరైన హర్ష మృతదేహాన్ని వెలికితీశారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఆర్కే బీచ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హర్ష మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విద్యార్థులు గల్లంతు విషయాన్ని కాలేజీకి, తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News