బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలి: KA PAUL
బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు...
దిశ, విశాఖపట్నం: బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖలో ఆయన షష్టి పూర్తి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ఏపీకి ఐదు లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఏపీని చంద్రబాబు దివాలా తీయించారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం రూ.8 లక్షల కోట్లకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ ఘటనలను నివారించాల్సిన బాధ్యతను ప్రధాని మోడీ విస్మరించారన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నుంచి దేశాన్ని రక్షించాలని పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ జెండా మోయడంతో పాటు ప్రజలను కూడా మోయమంటున్నారని విమర్శించారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. తనను చంపడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారని, వైయస్ఆర్ తనకు నరకం చూపారని, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన జోలికి రాలేదని కేఏ పాల్ తెలిపారు.