Manyam: ఒంటరి ఏనుగు మళ్లీ రచ్చ.. రచ్చ

పార్వతీపురం మన్యం జిల్లాల్లో మరోసారి బీభత్సం సృష్టించింది..

Update: 2023-10-30 04:47 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు కొద్ది రోజులుగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. స్థానిక గ్రామాల్లో తిరుగుతూ ఈ ఏనుగు హల్ చల్ చేస్తోంది. పంట పొలాల్లో సంచరిస్తూ తీవ్ర నష్టం వాటిల్లేలా బీభత్సం సృష్టిస్తోంది. ఇక రోడ్లపై అయితే భారీ వాహనాలు అడ్డుకుంటూ వాటి అద్దాలను ధ్వంసం చేస్తోంది. తాజాగా ఈ ఏనుగు ఆగడాలు మరింతగా పెరిగిపోయాయి. పార్వతీపురం పట్టణంలో ఈ ఏనుగు రాత్రి సమయంలో సంచరించింది. పట్టణ శివారు ప్రాంతమైన కొత్తవలసలో భయోత్పాన్ని సృష్టించింది. వీధుల్లో తిరుగుతూ ఆస్తి నష్టం కలిగింది. అటు పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో కూడా అటు ఇటూ తిరిగింది. కంటికి కనిపించిన వాటిని ధ్వంసం చేసింది. కొంతసమయం తర్వాత జంఘావతి కాలువ వైపు వెళ్లిపోయింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏనుగు సంచారంపై స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు తమపై ఏనుగు దాడి చేస్తోందనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఒంటరి ఏనుగును అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు.


కాగా కొన్ని నెలల క్రితం 8 ఏనుగులు పార్వతీపురం జిల్లాలో సంచరించాయి. అటవీ ప్రాంతం నుంచి స్థానిక గ్రామాల్లోకి వెళ్తూ బీభత్సం సృష్టించాయి. అయితే ఏడు ఏనుగు గరుగుబిల్లి మండలం గొట్టివలసలో సంచరిస్తున్నాయి. ఒక ఏనుగు మాత్రం గుంపు నుంచి విడిపోయి సంచరిస్తోంది. గ్రామ శివారు ప్రాంతాలు, జనావాసాల్లో సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


Similar News