Visakha: మందుబాబు హల్ చల్.. నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని దుకాణంపై పెట్రోల్ దాడి
విశాఖ జిల్లా మధురవాడ కొమ్మాదిలో మందుబాబు హల్ చల్ చేశారు. ..
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా మధురవాడ కొమ్మాదిలో మందుబాబు హల్ చల్ చేశారు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని బీభత్సం సృష్టించారు. కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణానికి వచ్చిన మందుబాబు ఓ బాటిల్ పేరు చెప్పి ఇవ్వాలని అడిగారు. అయితే ఆ బ్రాండ్ లేదని దుకాణం సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మందుబాబు పరుగెత్తుకుంటూ తన బైక్ వద్దకు వెళ్లారు. బైక్‌లో నుంచి పెట్రోల్ తీసి దుకాణంపై పోసి నిప్పంటించారు. అప్రమత్తమైన సిబ్బంది నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. ఈ ఘటనలో 15 మద్యం కేసులు, ప్రింటర్, కంప్యూటర్ ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.