Visakha: బ్రిక్స్ సదస్సుకు ఉక్కుకార్మిక నేతకు ఆహ్వానం

ఈ నెల 26, 27 తేదీల్లో సౌత్ ఆఫ్రికా దేశం దర్భన్‌లో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి జె. రామకృష్ణ హాజరుకానున్నారు..

Update: 2023-09-07 14:15 GMT

దిశ, గాజువాక: ఈ నెల 26 ,27 తేదీల్లో సౌత్ ఆఫ్రికా దేశం దర్భన్‌లో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి జె. రామకృష్ణ హాజరుకానున్నారు. ఈ మేరకు ఏ. ఐ.టి.యూ.సి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌత్ ఆఫ్రికా దేశం దర్బన్‌లో జరుగనున్న సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక నేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ఎకనామిక్ గ్రోత్, స్కిల్ డెవలప్‌మెంట్, జాబ్ క్రియేషన్స్ , బెటర్ ఇన్‌కమ్ లాంటి తదితర అంశాలపై కార్మిక నేతలు చర్చించనున్నారు 


Similar News