Visakha: విశాఖ జోన్-8లో జోరుగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జోన్ -8 పరిధి బాజీ జంక్షన్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి...
దిశ, పెందుర్తి: విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జోన్ -8 పరిధి బాజీ జంక్షన్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. బుచ్చిరాజుపాలెంలో అడుగడునా అక్రమ భారీ భవంతులు వెలుస్తున్నాయి. 1, 2 ఫోర్లకు మాత్రమే అనుమతులు తీసుకుని అంతకు మించి భారీ నిర్మానాలు చేపడుతున్నారు. దీనంతటికి బదిలీపై వెళ్లిన అధికారి చేసిన తప్పులని అధికారులు చెప్పుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారి అక్రమ నిర్మాణం వైపు చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిల్లర్లతో టౌన్ ప్లానింగ్ అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల జీవీఎంసీ ఆదాయానికి గండి పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై వెంటనే తగు చర్యలు తీసుకుకోవాలని ప్రజలు కోరుతున్నారు.