చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం: CPI
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని సీపీఐ అభిప్రాయపడింది...
దిశ, గాజువాక: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని సీపీఐ అభిప్రాయపడింది. పెద గంట్యాడ సీపీఐ కార్యాలయం పోతిన సన్యాసిరావు భవన్‌లో సీపీఐ సమావేశం జరిగింది. సీపీఐ గాజువాక నియోజక వర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు ను అరెస్ట్ చేసిన తీరు సరైంది కాదన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేసి ప్రజల్లో మమేకమైన వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.
సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు టిడిపి నేత చంద్రబాబు కు సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతును తెలుపుతుందన్నారు. తక్షణమే చంద్రబాబును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు జి. ఆనంద్ , పి. దుర్గారావు , అప్పారీ విష్ణు మూర్తి , వై. దెముల్లు పాల్గొన్నారు