కృపమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి: CITU

ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు విశాఖలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు...

Update: 2023-10-07 16:57 GMT

దిశ, విశాఖ: ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు విశాఖలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. తాడేపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విధుల ఒత్తిడితో ఆశ వర్కర్లు మృతి చెందడం విచారించదగ్గ విషమన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 100 మంది ఆశా వర్కర్స్ నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జగన్న సురక్ష పేరుతో ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆశా వర్కర్లు మరణిస్తే 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్ట బద్ధతమైన ఆశా వర్కర్స్‌కు సెలవు దినాలు ప్రకటించాలని, డిమాండ్లను నెరవేర్చక పోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


Similar News