Visakha: ఫారెన్ ట్రేడ్ రీజినల్ ఆఫీసులో CBI-ACB ఆపరేషన్.. పలువురు ఉద్యోగుల అరెస్ట్
లంచాలపై విశాఖలో సీబీఐ-ఏసీబీ అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. ....
దిశ, వెబ్ డెస్క్: లంచాలపై విశాఖలో సీబీఐ-ఏసీబీ అధికారులు ఆపరేషన్ నిర్వహించారు.ఫారెన్ ట్రేడ్ రీజినల్ కార్యాయంలో అవినీతి జరుగుతుందని ఫిర్యాదు అందాయి. ఎగుమతి-దిగుమతుల పత్రాలకు క్లియరెన్స్ ఇచ్చేందుకు కంపెనీల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కీర్తి కంపెనీ డైరెక్టర్ సీతారామారాజు లంచి ఇచ్చినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ-ఏసీబీ అధికారులు విశాఖతో పాటు హైదరాబాద్, బెంగళూరులో సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీఎన్ రమేశ్ అనే ఉద్యోగి రూ. 4 లక్షలు లంచం తీసుకున్నారు. సెక్షన్ హెడ్ రూ. 50 వేలు తీసుకుంటూ దొరికిపోయారు. ఈ ఆపరేషన్‌లో పలు కీలక పత్రాలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.