Vijayasai Reddy: మహానాడు కాదు.. మహాగోడు: ట్వీట్టర్‌‌లో విజయసాయిరెడ్డి సెటైర్లు

ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా తిట్ల తీర్మానాలు, శాపనార్ధాలు ప్రసంగాలతో జరుగుతున్నది మహానాడు కాదని మహా గోడు వల్లకాడు అని ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) విమర్శించారు.

Update: 2022-05-28 12:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా తిట్ల తీర్మానాలు, శాపనార్ధాలు ప్రసంగాలతో జరుగుతున్నది మహానాడు కాదని మహా గోడు వల్లకాడు అని ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) విమర్శించారు. ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు(Chandrababu) పై మండిపడ్డారు. నేటితో వందో పుట్టినరోజు జరుపు కోవాల్సిన తారక రాముడికి. 27 ఏళ్ల క్రితమే నూరేళ్ళూ నిండేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్‌(NTR) జయంతిలో దొంగ నమస్కారం పెడుతున్న బాబును చూసి తెలుగు జాతి నోట ఒకటే మాట. ఛీ ఛీ. కోకిలలు కొద్ది రోజులే బతుకుతాయ్‌! కాకులు మాత్రం కలకాలం బతుకుతున్నాయ్‌! మహానాడు పేరుతో 'తొడలనాడు' నిర్వహిస్తూ, 'పెయిడ్ ఆర్టిస్టులు' చేత తొడలు కొట్టిస్తూ, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు నటిస్తూ కామెడీ పండిస్తున్న బాబుకు, టీడీపీకి జనం 2024 లో తొడపాశం పెడతారని ఎంపీ విమర్శించారు.

మగవారితో పాటు మహిళలతోనూ బూతులు మాట్లాడిస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం చౌతాలాకు ఢిల్లీ సీబీఐ కోర్టు 4 ఏళ్ల శిక్ష విధించింది. 6 కోట్ల ఆస్తులకు ఆయన లెక్క చూపలేకపోయారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi) 2005లో చంద్రబాబు పై ఇలాంటి కేసే వేసింది. 17 ఏళ్లుగా స్టేలతో విచారణకు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ చైతన్య వంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మేలు చేస్తున్న సీఎం జగన్ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News