వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ.. జగన్‌కు రాజీనామా లేఖ పంపిన విజయసాయిరెడ్డి

మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఈ రోజు సాయంత్రం వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ.. జగన్‌(Jagan)కు రాజీనామా లేఖ(Resignation letter) పంపారు.

Update: 2025-01-31 17:02 GMT
వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ.. జగన్‌కు రాజీనామా లేఖ పంపిన విజయసాయిరెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఈ రోజు సాయంత్రం వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ.. జగన్‌(Jagan)కు రాజీనామా లేఖ(Resignation letter) పంపారు. కొద్దిరోజుల క్రితం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ట్విట్టర్ వేదికగా.. వైసీపీ పార్టీ సభ్యత్వం తో పాటు, తనకు ఇచ్చిన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. అలాగే 2029లో జగన్‌ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానని, నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు, శత్రుత్వాలు, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జీవించాలని, వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానం ప్రారంభించానంటూ తన ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్ ను ట్యాగ్ చేసి రాసుకొచ్చారు. కాగా విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించగా.. ఆయన బీజేపీలో చేరుతారని వైఎస్ షర్మిలతో పాటు పలువురు రాజకీయ నేతలు చెప్పుకొచ్చారు. కాగా ఆయన వారందరికీ షాక్ ఇస్తూ.. పూర్తిగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికి విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్పించుకొని ఆయన గవర్నర్ పదవి ఇస్తారని నేటికి పలువురు నేతలు చెప్పుకొస్తున్నారు.

విదేశీ పర్యటన సీబీఐ కోర్టు అనుమతి..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి ఆయన దేశం విడిచి వెళ్లాలంటే సీబీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రాన్స్, నార్వే దేశాలకు వెళ్లేందుకు తనకు నెల రోజులు అనుమతి ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. అనంతరం ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. సీబీఐ అధికారుల వాదనలు కూడా విన్న తర్వాత.. విజయసాయిరెడ్డి 15 రోజులు పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు 15 రోజుల పాటు ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు అని సీబీఐ కోర్టు విజయ సాయి రెడ్డికి సూచించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News