వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని షాక్.. ఈడీ నోటీసులు జారీ?

వైసీపీ ఎంపీ(YCP MP) విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)కి ఊహించని షాక్‌ తగిలింది.

Update: 2024-12-20 05:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ(YCP MP) విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)కి ఊహించని షాక్‌ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌(కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ(Enforcement Directorate) ఉచ్చు బిగిస్తోంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేత(YCP Leader), రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందితులకు మరోమారు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇది వరకు జారీచేసిన నోటీసులకు వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ నోటీసులు జారీ కావడం పై ఇంకా స్పందించలేదు. ఇది ఎంత వరకు నిజమో  తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News