CBI Court: వివేకా హత్య కేసు పిటిషన్లపై విచారణ వాయిదా

వివేకా హత్య కేసులో దాఖలైన రెండు పిటిషన్లపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది..

Update: 2023-06-02 13:11 GMT

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో దాఖలైన రెండు పిటిషన్లపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి తమ న్యాయవాది సహకరించేందుకు అనుమతివ్వాలని వైఎస్ సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారించింది. అయితే ఈ పిటిషన్‌పై శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపించగా.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి మాత్రం కౌంటర్లు దాఖలు చేయలేదు. దీంతో సునీత పిటిషన్‌పై విచారణను ఈ నెల 5కి వాయిదా పడింది.

మరోవైపు వివేకా లేఖను నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది. ఈపిటిషన్ పై గంగిరెడ్డి తో పాటు సునీల్ యాదవ్ కౌంటర్లు వేయగా.. శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వైపు కౌంటర్ లేదని అప్రూవర్ దస్తగిరి సీబీఐ కోర్టుకు తెలిపారు. ఇక సీబీఐ వాదనల కోసం ఈ కేసు విచారణను ధర్మసనం ఈ నెల 5కి వాయిదా వేసింది. 

Also Read..

Delhi: సీఎం జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ 

Tags:    

Similar News