వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు..?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారంలో ఉన్న వైసీపీకీ దెబ్బ మీద దెబ్బ పడుతుంది.

Update: 2024-02-19 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారంలో ఉన్న వైసీపీకీ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటూ.. రెబల్ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. అలాగే మరికొందరు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. ఈ క్రమంలోనే వైసీపీ చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకుని పార్టీ మారేందుకు రంగం సిద్దమయ్యారని.. మరో రెండు రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే.. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం పార్టీపై ఉన్న అసంతృప్తితో ఉన్నారని.. అందుకే నిన్న రాప్తాడు లో జరిగిన సీఎం జగన్ సభకు ఆయన హాజరు కాలేదని తెలుస్తుంది.

ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా వేరే వ్యక్తిని నియమించింది. దీంతో జయరాం కూడా త్వరలోనే వైసీపీకి గుడ్ బాయ్ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఎమైనప్పటికి సర్వేల ఆధారంగా నియోజకవర్గాలు ఇన్‌చార్జులను మార్చిన జగన్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు. ఇలానే కీలక నేతలు పార్టీని వీడితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరింత గడ్డుకాలం గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News