AP News:‘వైసీపీ హయాంలోనే అక్రమ రవాణా’.. ఎమ్మెల్యే వనమాడి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కాకినాడ పోర్టు(Kakinada Port) వద్ద జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కాకినాడ పోర్టు(Kakinada Port) వద్ద జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(MLA Vanamadi Venkateswara Rao) స్పందించారు. వైసీపీ()YSRCP) హయాంలోనే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice) మొదలైందని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి(Former YCP MLA Dwarampudi) ప్రమేయంతో ఇదంతా జరుగుతోందన్నారు. పేదలకు అందజేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి వ్యాపారం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. రేషన్ అక్రమ రవాణా నేపథ్యంలో ఎమ్మెల్యే వనమాడి పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.