ఏపీ లిక్కర్ స్కామ్.. నేడు విచారణకు మిథున్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-04-19 02:31 GMT
ఏపీ లిక్కర్ స్కామ్.. నేడు విచారణకు మిథున్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు. కాగా నేడు మిథున్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. మిథున్ రెడ్డి స్టేట్‌మెంట్ అధికారులు రికార్డు చేయనున్నారు. మరోవైపు నేడు విచారణకు రావాలని కేసులో ప్రధాన నింధితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కసిరెడ్డి విచారణకు హాజరవ్వలేదు. అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకున్నారు. నిన్న విచారణకు హాజరైన సాయి రెడ్డి కసిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

కసిరెడ్డే ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అని అన్నీ ఆయనకే తెలుసని చెప్పారు. కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ అని తెలియక ప్రోత్సహించానని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన తెరవెనుక లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోశించారనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్లు చెల్లించిన కంపెనీ నుండి నెలకు రూ.60 కోట్లు వసూలు చేసి దాదాపు రూ.3వేల కోట్ల స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కసిరెడ్డి సిట్ విచారణకు హాజరైతే అన్ని నిజాలు బయటపడే అవకాశాలున్నాయి. మరి ఈ రోజు అయినా ఆయన వస్తారా లేదా అనేది చూడాలి. 

Tags:    

Similar News