Tirumala Updates: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది.

Update: 2024-07-16 04:28 GMT
Tirumala Updates: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది. వరుస సెలవులు ముగియడంతో శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 75,054 మంది భక్తులు దర్శించుకోగా, 26,239 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News