Tirumala Samacharam: భక్తులతో కిక్కిరిసిన తిరుమల క్షేత్రం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

శ్రీవారి సన్నిథి తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.

Update: 2024-04-28 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి సన్నిథి తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శనివారం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు టెకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఖచ్చితంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శనివారం స్వామి వారిని 81,212 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 32,403 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News