Tirumala Samacharam: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. తగ్గిన భక్తుల రద్దీ, దర్శనానికి కేవలం 8 గంటల సమయం

భక్తుల కొంగుబంగారం, ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.

Update: 2024-07-31 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: భక్తుల కొంగుబంగారం, ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 69,937 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 22,978 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News