Breaking: బిగ్ అలర్ట్.. మరో మూడు గంటల్లో పిడుగులు..!
ఏపీలో మరో మూడు గంటల్లో పలుచోట్ల పిడుగుల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మరో మూడు గంటల్లో పలుచోట్ల పిడుగుల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather) వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఈ సంమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెలకాపరులు చెట్ల కింద నిలుచోవద్దని ప్రకటించింది. మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షంతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.