AP:హత్యలు చేసిన వారికి శిక్షలు తప్పవు:చంద్రబాబు నాయుడు

ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

Update: 2024-04-30 14:18 GMT
AP:హత్యలు చేసిన వారికి శిక్షలు తప్పవు:చంద్రబాబు నాయుడు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను హత్య చేసిన వైసీపీ గుండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పింఛన్లు కూడా ఒకటో తేదీన అందిస్తామన్నారు. కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More...

సైకో మేనిఫెస్టో అడ్రస్‌ లేకుండా పోయింది..చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ 

Tags:    

Similar News