ఆ విషయంలో పురంధేశ్వరి ఆలోచనా విధానంలో పొరపాటు ఉంది : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
నా బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీజేఐకు లేఖ రాయడంలో అర్థం లేదని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ‘నా బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీజేఐకు లేఖ రాయడంలో అర్థం లేదు’అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పురంధేశ్వరి ఆలోచనా విధానంలో పొరపాటు ఉందని చెప్పుకొచ్చారు. సంస్కరణలు తీసుకు వచ్చి త్వరితగతిన కేసులు పరిష్కరించాలన్నది బీజేపీ చేతుల్లోనే ఉందని చెప్పుకొచ్చారు. అయితే త్వరితగతిన పరిష్కరించడానికి ఆస్తి కాదని చెప్పుకొచ్చారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లోఓటర్లే దీనికి తీర్పు ఇస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారని వెల్లడించారు. మరోవైపు తెలంగాణాలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అంటే విలువలు లేని పొత్తులు రాజకీయాల్లో చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంతమంది పొత్తులతో వచ్చినా వైసీపీ సింహంలా సింగిల్‌గా వస్తుందని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఒంగోలులో నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితులు అందరినీ పోలీసులు అరెస్టు చేస్తారని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.