జనసేనాని కొన్న మూడెకరాల భూమి ధరెంతో తెలిస్తే షాక్.. ఎందుకు కొన్నారంటే?

జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.

Update: 2024-07-05 03:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత  2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు. ఇన్నాళ్లు అపజయాలు చవిచూసిన పవర్ స్టార్ ఏనాడు వెనకడుగు వేయకపోవడం విశేషం. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ఏం చక్కా సినిమాలు తీసుకుంటూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయకా.. రాజకీయాలు అవసరమా? అంటూ పవన్ ను హేళన చేసిన వారే ఇప్పుడు చేతులేత్తి నమస్కారం చేసే పరిస్థితి వచ్చింది.

ఇకపోతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో మూడున్నర ఎకరాల భూమి కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. పవన్ కొనుగోలు చేసిన మూడున్నర ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కంప్లీట్ అయ్యింది. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలోని రెండు బిట్లను డిప్యూటీ సీఎం రిజిస్ట్రేషన్ చేపించారు. 1. 44 ఎకరాలు ఒకటి.. రెండోది 2. 8 ఎకరాలు ఉంటుంది. అయితే పవన్ ఈ ల్యాండ్ ఎన్ని లక్షలు పెట్టి కొన్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎకరాకు రూ. 15- 16 లక్షల వరకు జనసేనాని పే చేసినట్లు సమాచారం. రెండు ఎకరాల్లో క్యాంప్ ఆఫీసు.. మిగిలిన స్థలంలో ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనలో  ఉన్నారట. 


Similar News