ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ 8 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం..?
ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పలుచోట్ల మరో రెండు రోజుల పాటు వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతావరణశాఖ(Meteorology Department) ప్రకటించింది. మంగళవారం 8 జిల్లాలో వాన పడుతుందని వెల్లడించింది. అలాగే పలు చోట్ల పిడుగుల(Thunders)తో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రెండు రోజుల పాటు అత్యవసరమైతేగాని బయటకు రావొద్దని తెలిపింది. రైతులు(Farmers), గొర్రెలకాపరులు(Shepherds), వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. పిడుగుల పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.