ఈసీ సీరియస్... ఐదుగురు సీఐల బదిలీ

తిరుపతి, తిరుమలలో పని చేస్తున్న ఐదుగురు సీఐలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది....

Update: 2024-05-12 12:35 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి, తిరుమలలో పని చేస్తున్న ఐదుగురు సీఐలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై చర్యలకు దిగింది. ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ ఆదేశించింది. తిరుమల సీఐ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి క్రైమ్ సీఐ వినోద్, కమాండ్ కంట్రోల్ రూమ్ సీఐ శ్రీనివాసులు, సీఐ అమర్‌నాథ్ రెడ్డితో పాటు మరో సీఐపై ఈసీ వేటు వేసింది. వెంటనే అనంతపురం డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వేళ సీఐల బదిలీలు తిరుపతి, తిరుమలలో కలకలం రేపింది. పోలీసు అధికారులకు, వైసీపీకి మధ్యవర్తిగా పని చేసి చేస్తూ తిరుమలలో చక్రం తిప్పినట్లు  సీఐ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి పెద్దిరెడ్డి సీఐ అమర్ నాథ్ రెడ్డి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఈసీ బదిలీ వేసింది. 


Similar News