AP News:సీఎం చంద్రబాబు నివాసం పై దాడి కేసు..వైసీపీ మాజీ మంత్రికి ఊరట..హైకోర్టు కీలక ఆదేశాలు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ వైసీపీ హయాంలో టీడీపీ నేతల ఇళ్లు, టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులపై తాజాగా కేసులు పెడుతున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పలువురు కీలక నేతలకు ఈ దాడిలో ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నివాసం పై దాడి కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన పేరు ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు (గురువారం) సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 16 వరకు తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 16వ తేదీ తర్వాత ఈ కేసు పై తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.