అలాంటి వారు మన మధ్య లేకపోవడం తీరని లోటు.. గాంధేయవాది మృతి పట్ల చంద్రబాబు విచారం

ప్రముఖ గాంధేయ వాది పసల కృష్ణ భారతి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Update: 2025-03-23 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాంధేయ వాది పసల కృష్ణ భారతి (Gandhian Pasala Krishna Bharathi) మృతి (Death) పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chndrababu Naidu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారు మన మధ్య లేకపోవడం తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. గాంధేయ వాది, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ (Hyderabad) స్వగృహంలో తుది శ్వాస (Last Breath) విడిచారని తెలిసి ఎంతో బాధ పడ్డానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల కుమార్తె అయిన కృష్ణ భారతి జీవితాంతం గాంధేయవాదిగా (Gandhian) ఉన్నారని తెలియజేశారు.

గాంధీజీ (Mahathma Gandhi) బోధించిన విలువలను పాటించారని, అట్టడుగు వర్గాల్లో విద్యావ్యాప్తికి కృషి చేశారని కొనియాడారు. విద్యాసంస్థలు, గోశాలలకు విరాళాలు సమకూర్చారని, అలాంటి వారు మన మధ్య లేకుండా పోవడం తీరని లోటు అని వ్యాఖ్యానించారు. ఇక వారి ఆత్మకు శాంతి చేకూరాలని (Rest In Peace) ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని సీఎం రాసుకొచ్చారు. కాగా ప్రముఖ గాంధేయవాదిగా ఉన్న పసల కృష్ణ భారతి హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని ఆమె స్వగృహంలో కన్ను ముశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్ లోని భీమవరాన్ని సందర్శించినప్పుడు కృష్ణ భారతిని కలిసి ఆమెకు సత్కారం చేశారు. అంతేగాక ఆమె పాదాలకు నమస్కరించి, ఆశీర్వచనం తీసుకున్నారు. 

Tags:    

Similar News