అంగన్‌వాడీల పవర్ అంటే అదీ.. పోలీసులపై తిరగబడి రచ్చరచ్చ (వీడియో వైరల్)
ఏపీలో అంగన్‌వాడీల ఆందళన తారాస్థాయికి చేరింది. ఎక్కడికక్కడ రోడ్లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉద్యోగులు ఆకస్మిక ఆందోళనలకు దిగుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అంగన్‌వాడీల ఆందళన తారాస్థాయికి చేరింది. ఎక్కడికక్కడ రోడ్లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉద్యోగులు ఆకస్మిక ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారిపై సీరియస్‌గా స్పందించింది. ఇప్పటి వరకు విధుల్లో చేరని అంగన్‌వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్మా చట్టం ప్రకారం వారందరికీ ఇప్పటికే నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ఇవాళ అంగన్‌వాడీల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందునేదుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అంగన్‌వాడీ కార్యకర్తలు లేడీ కానిస్టేబుళ్లను పక్కకు ఈడ్చి పడేశారు. అనంతరం తమతో పాటు ఆందోళన కూర్చోవాలంటూ ఒత్తిడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.