భూ అక్రమ రిజిస్ట్రేషన్‌లలో ఆ జిల్లా టాప్!
రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు జరిపిన వ్యవహారంలో శ్రీ సత్య సాయి జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దిశ ప్రతినిధి, ధర్మవరం: రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు జరిపిన వ్యవహారంలో శ్రీ సత్య సాయి జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 10 టాప్ మండలాల్లో శ్రీ సత్య సాయి జిల్లాలో ఆరు మండలాలు ఉండటం గమనార్హం. శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ, అమరాపురం, రామగిరి, కనగానపల్లి, సోమందేపల్లి, పెనుగొండ మండలాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారించారు.