Ap: రోడ్డుపై జనాలను హడలెత్తించిన లారీ డ్రైవర్.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

విజయనగరం జిల్లా రాజాంలో రోడ్డుపై భయానక పరిస్థితి నెలకొంది...

Update: 2025-02-02 11:02 GMT
Ap:  రోడ్డుపై జనాలను హడలెత్తించిన లారీ డ్రైవర్..  దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా రాజాం(Rajam)లో రోడ్డుపై భయానక పరిస్థితి నెలకొంది. లారీ(Lorry)ని అతివేగంగా రాంగ్ రూట్‌(Wrong Route)లో నడిపారు. అంతేకాదు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టబోయారు. దీంతో స్థానికులు, వాహనదారులు(Vehicles) భయాందోళనకు గురయ్యారు. లారీని వెంబడించి నిలుపుదల చేశారు. డ్రైవర్‌(Driver)ను అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు డ్రైవర్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పెద్ద ప్రమాదమే తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. లారీ ఓనర్‌కు సమాచారం అందించారు. మద్యం అలవాటు ఉన్న డ్రైవర్‌కు లారీని ఇవ్వడం కూడా తప్పేనన్నారు. సోమవారం కోర్టుకు హాజరుకావాలని సూచించారు. కోర్డు ఆదేశాల మేరకు నడుచుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డ్రైవర్లకు పోలీసులు పలు సూచనలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్లు తమ ఫ్యామిలీలను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రమాదాలు చేసి కుటుంబాలకు దూరం కావొద్దని పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News