Breaking: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఆ ఇద్దరు వీరే...!
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు...
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ అభ్యర్థుల్లో బీజేపీ(BJP) నుంచి ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) ఎంపిక అయిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నుంచి మిగిలిన రెండు స్థానాలకు తాజాగా అభ్యర్థులు ఖరారు అయ్యారు. సానా సతీశ్(Sana Satish)తో పాటు బీద మస్తాన్ రావు(Beda Mastan Rao) పేర్లను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కాగా టీడీపీ నుంచి సానా సతీశ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు పోయింది. దీంతో నాసా సతీశ్‌కు రాజ్యసభ కేటాయిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. తాజాగా ఇది కరెక్ట్ అయింది. ఇక బీద మస్తాన్ రావు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. రాష్ట్రంలో వైసీపీ(Ycp) ఓడిపోవడంతో పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేశారు. రాజ్యసభ(Rajya Sabha)కు మరోసారి అవకాశం ఇస్తారనే హామీతో పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం నుంచి రాజ్యసభకు ఎంపికకావడంతో బీదా మస్తాన్ రావు విషయంలో జరిగిన ప్రచారం నిజమైంది.