టీడీపీ ఫ్లెక్సీల చించివేత..కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్ర బాబును పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించారు.
దిశ, ప్రతినిధి: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్ర బాబు ను పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే సీటు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన ఉన్నం హనుమంతరాయ చౌదరి అనుచరులు, టీడీపీ శ్రేణులు అధినేత నిర్ణయంతో భగ్గుమన్నారు. చంద్రబాబు తో కూడిన ఫ్లెక్సీలు చించివేయడం తో పాటు దహనం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు తమ మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి క్యాంపు కార్యాలయంలో టీడీపీ జెండాలు ఫ్లెక్సీలు తొలగించారు.డబ్బుకు అమ్ముడు పోయావంటూ చంద్రబాబుపై మండి పడ్డారు. ఇకనుంచి అన్న క్యాంటీన్ లేదన్నారు. చించిన చంద్రబాబు ఫ్లెక్సీలను రోడ్డుపైకి తెచ్చి పడేశారు. నీవు ముఖ్యమంత్రి కావాలని ఇన్ని రోజులు ఎంతో కష్టపడుతున్నా మాకే టికెట్ రానప్పుడు నువ్వు నాశనం అయిపోవాలని కార్యకర్తలు మండిపడ్డారు.
Read More..
మడకశిర టీడీపీలో తీవ్ర ఉద్రిక్తత.. అభ్యర్థి తండ్రిపై చెప్పుల దాడి