TDP: మృతుల కుటుంబాలను ఆదుకుంటాం.. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు
కర్ణాటకలో మంత్రాలయ విద్యార్థుల రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పందిచారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో మంత్రాలయ విద్యార్థుల రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పందిచారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విద్యార్థులు, డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన.. కర్ణాటక(Karnataka)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో మంత్రాలయం వేద పాఠశాలకు(Manthralaya Veda Patashala) చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి(Students Died) చెందిన వార్త దిగ్భ్రాంతి(Shock)ని, తీవ్ర ఆవేదనను కలిగించిందని తెలిపారు. హంపీకి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను అదేశించినట్లు సీఎం చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి(Deep Condolences) తెలియజేశారు. ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.