మోహన్‌బాబు ప్రవర్తన దిగజారినట్టు అనిపించింది: పల్లా శ్రీనివాసరావు
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేసిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు..
దిశ, వెబ్ డెస్క్: జర్నలిస్టుల(Journalists)పై మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) దాడి చేసిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (TDP state president Palla Srinivasa Rao)స్పందించారు. జర్నలిస్టులపై దాడి చేస్తున్న దృశ్యాలు చూసిన తమకు మోహన్‌బాబు ప్రవర్తన దిగజారినట్టు అనిపించిందన్నారు. జర్నలిస్టుపై దాడి ఘటన చాలా బాధ కలిగించిందని, తాను ఖండిస్తున్నానని తెలిపారు. సినీ యాక్టర్లు అంటే బంధువుల్లా ఫీల్ అవుతామని చెప్పారు. సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ల వ్యవహారాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తూఉంటారని చెప్పారు. ప్రజా సంబంధాలతో ఉండే జర్నలిస్టులపై దాడి సరికాదని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఖండించారు.