ముగిసిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం.. కడపలో "మహానాడు"
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశం (TDP Politburo meeting) ఈ రోజు అమరావతిలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశం (TDP Politburo meeting) ఈ రోజు అమరావతిలో జరిగింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో కోటి సభ్యత్వాల నమోదు లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడు (Mahanadu) లోపు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన సరిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా టీడీపీకి కీలకం అయిన టీడీపీ మహానాడు (TDP Mahanadu) కార్యక్రమాన్ని కడప జిల్లాలో నిర్వహించాలని పోలిట్‌బ్యూరో సమావేశం (Politburo meeting)లో నిర్ణయించారు. ఈ మహానాడును రెండు రోజుల పాటు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ ఏ తేదీల్లో నిర్వహిస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా కడప జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ పార్టీ (TDP party) గత ఎన్నికల్లో సైతం వైసీసీ కంచుకోట అయిన ప్రాంతంలో సైతం విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోసారి ఇదే లక్ష్యంగా చేసుకున్న టీడీపీ కడప జిల్లా(Kadapa District)లో మహానాడును నిర్వహించేందుకు సిద్ధం అయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కడప జిల్లాలో ఏ ప్రాంతంలో ఈ మహానాడు (Mahanadu) కార్యక్రమం నిర్వహిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. ఈ రోజు పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తో పాటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, మంత్రి అచ్చెన్నాయుడు, హోం మంత్రి అనిత, సుబ్రహ్మణ్యం, కళా వెంకటరావు, కాలువ శ్రీనివాసులు, గుమ్మడి సంధ్యారాణి, బిడి జనార్థన్, తోట సీతారామలక్ష్మీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి తో పాటుగా పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.