ఏపీకి కేంద్ర బడ్జెట్ ఊపిరినిచ్చింది: టీడీపీ ఎంపీలు

ఏపీకి కేంద్రం కేటాయించిన బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-07-23 08:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతికి కేంద్రబడ్జెట్‌లో రూ. 15 వేలు కోట్లు కేటాయించింది. అలాగే వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు ప్రత్యేక కార్యక్రమాల్లోనూ ఏపీకి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. దీంతో కేంద్రబడ్జెట్‌పై ఏపీ టీడీపీ ఎంపీలు స్పందించారు. కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలోని ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఉన్న సమస్యలకు ఒక సమాధానం చెప్పే విధంగా కేంద్రబడ్జెట్ ఉందన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వంపై ఏపీ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి బడ్జెట్‌లో రూపకల్పన చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఊపిరి పిల్చుకునే పరిస్థితిని బడ్జెట్ కల్పించింది. ప్రజలు ఆనందపడే అవకాశం వచ్చింది. ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోతే ఏపీ పూర్తిగా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది.’ అని టీడీపీ ఎంపీలు తెలిపారు.

‘ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి కట్టుగా కూటమిని ఏర్పరచి ప్రజల్లో విశ్వాసం కల్పించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తూ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్‌లో రూప కల్పన చేశారు.ఏపీ రాజధానికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తూ గౌరవాన్ని ఇచ్చారు. ఎన్నికలకు ముందు రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. గత ఐదేళ్లలో అమరావతి పరిస్థితి ఏంటో చూశాం. కక్ష పూరితంగా అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు 72 శాతం పూర్తి చేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు ముందుకు వచ్చి నిధులు కేటాయిస్తామన్నారు. ఏపీకి కేటాయించిన బడ్జెట్ నూతన విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.’ అని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.


Click Here For Budget Updates!

Tags:    

Similar News