AP News:‘ఎన్నికల వరకే రాజకీయం’..టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ఎన్నికల వరకే రాజకీయాలు చేసుకోవాలని అనంతరం అందరూ కలిసి మాచర్ల ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు.

Update: 2024-06-28 07:46 GMT

దిశ ప్రతినిధి,నరసరావుపేట:ఎన్నికల వరకే రాజకీయాలు చేసుకోవాలని అనంతరం అందరూ కలిసి మాచర్ల ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరై పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మరమ్మత్తులకు మరియు ఒకటవ వార్డు నుంచి 31 వ వార్డు వరకు మున్సిపాలిటీ వాటర్ పైపు లేని పట్టణ శివారు ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించే ఈ రెండు అంశాలను కౌన్సిల్‌తో కలిసి ఆమోదించారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన కొన్ని అంశాలపై కమిటీ ద్వారా చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

మాచర్ల పట్టణంలో డెంగ్యూ వ్యాధి కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని తన దృష్టికి వచ్చిందని సానిటరీ విభాగం వారు దోమలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరారు. అతి త్వరలోనే బుగ్గ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా మంచి నీటిని అందిస్తామన్నారు. మాచర్ల పట్టణానికి వెల్దుర్తి మాచర్ల మండలం దుర్గి రెంట చింతల మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో మహిళలు తమ కుటుంబాల కోసం వస్తూ ఉంటారని వారికి కనీసం మరుగుదొడ్లు లేవని వాటి దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరలో పట్టణంలో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు. కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిలర్లు మొత్తం జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు కౌన్సిలర్లు మదర్ సాహెబ్ రామిరెడ్డి నరసింహారావు సుభాని మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు మున్సిపల్ ఏఈ లు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News