వల్లభనేని వంశీని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది: SVSN వర్మ కీలక వ్యాఖ్యలు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పుడు కాదని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని టీడీపీ నేత SVSN వర్మ అన్నారు..

Update: 2025-02-13 12:11 GMT
వల్లభనేని వంశీని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది: SVSN వర్మ కీలక  వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi)ని ఇప్పుడు కాదని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని టీడీపీ నేత SVSN వర్మ అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు(Gannavaram TDP office attack case)లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ(TDP leader Varma) స్పందించారు. మంత్రి లోకేశ్(Minister Lokesh) రెడ్ బుక్ చట్టాన్ని ఫాలో అవుతుందని కాబట్టే వంశీ అరెస్ట్ ఇంత ఆలస్యమైందన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఎవరూ క్షమించరన్నారు. ఆ దాడిలో వంశీ పాత్ర ఉంది కాబట్టే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని వర్మ ఆరోపించారు. అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో వేయడం తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. చట్టం, విధానం, విచారణ తర్వాత అరెస్టులు ఉంటాయన్నారు. వంశీ తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లబోతున్నారని వర్మ వ్యాఖ్యానించారు.


కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభవనేని వంశీని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే వల్లభనేని వంశీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కోర్టులో కేసు వాపస్ తీసుకున్న సత్యవర్థన్‌కుమార్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ కాల్ రికార్డు కీలకంగా మారింది.

Tags:    

Similar News