Ap News: నారా లోకేశ్‌పై 22 కేసులు..!
తనపై హత్యాయత్నం సహా 22 తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ..
దిశ, వెబ్ డెస్క్: తనపై హత్యాయత్నం సహా 22 తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిన విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఎంటగట్టాలని టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ సూచించారు. వారితో భేటీ అయి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ విషయంలో Ap Cid చట్టాలను ఉల్లంఘించిందని మండిపడ్డారు. 17 (A) నిబంధన ప్రకారం అరెస్ట్ చేయాలనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాంటి 17(A)నిబంధనను పాటించనందున చంద్రబాబు అరెస్ట్ చెల్లదని తెలిపారు. స్కిల్ కేసులో అధికార దుర్వినయోగం కనిపిస్తోందన్నారు. ఏపీతో సహా 6 రాష్ట్రాల్లో సీమెన్స్ సంస్థ ఇదే తరహా ఎంవోయూలు కుదుర్చుకుందని లోకేశ్ పేర్కొన్నారు. చంద్రబాబుకు డబ్బులు చేరినట్లు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఎంవోయూ ప్రకారం ప్రేమ్ చంద్రారెడ్డి, అజేయ కల్లం నిధులు విడుదల చేశారని.. ఎఫ్ఐఆర్‌లో వారి పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. అజేయ కల్లం ప్రస్తుతం సీఎం జగన్ కు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని గుర్తుచేశారు. ఐఏఎస్ అధికారుల కమిటీ గుజరాత్ వెళ్లి ప్రాజెక్టును అధ్యయనం చేశారన్నారు. అధికారుల సిఫార్సుల మేరకే రాష్ట్రంలో నిధులు విడుదల జరిగిందని నారా లోకేశ్ తెలిపారు.